జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ.
బిక్కవోలు మేజర్ న్యూస్. కాకినాడలోని ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన 5వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బిక్కవోలు మండలం కొమరిపాలెం శ్రీ రామ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
కటాస్ విభాగంలో ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు, నలుగురు విద్యార్థులు రజత పతకాలు, ముగ్గురు విద్యార్థులు కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థులు తమ ప్రతిభతో పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు కరాటే వంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెరుగుతాయని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ కె. దేవి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ డి. సుబ్రమణ్యంను అభినందించారు.పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.