BREAKING
సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం... శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక

Select Suryaa Now
మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక

అంబాజీపేట మేజర్ న్యూస్ : మద్యానికి బానిసై విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేయడంతో మామిడిశెట్టి సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది. ఈ దారుణ ఘటనపై ఆదివారం జన విజ్ఞాన వేదిక (JVV) సభ్యుడు, మద్యపాన వ్యతిరేక ఉద్యమ నాయకుడు డాక్టర్ ఎన్. సూర్యనారాయణ బృందం మృతుడి నివాసానికి వెళ్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించింది. దాడి జరిగిన తీరును, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అనేక నేరాలకు, అనర్థాలకు మద్యమే మూలకారణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. మద్యపాన వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాష్, శరత్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.