BREAKING
సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం... శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి

Select Suryaa Now
ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి

                           చైర్మన్, కౌన్సిలర్లకు మంత్రి వాసంశెట్టి సుభాష్ దిశానిర్దేశం

రామచంద్రపురం, మేజర్ న్యూస్:మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ప్రజల మన్ననలను పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పిలుపునిచ్చారు
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, కూటమి కౌన్సిలర్లతో మంత్రి సుభాష్ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేడిశెట్టి శేషారావు, కూటమి కౌన్సిలర్లకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.  ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు నిరంతరం వివరిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కౌన్సిలర్లు లేని వార్డుల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇన్చార్జులుగా బాధ్యతలు స్వీకరించి, ఆయా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో సాధించిన విజయం కేవలం ఐదేళ్లకే పరిమితం కాకుండా, ప్రజల ఆదరాభిమానాలతో నిరంతరం కొనసాగాలంటే ప్రజలతో మమేకమై, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.ఐదేళ్ల విజయాన్ని శాశ్వత ప్రజాభిమానంగా మలుచుకుందాం అని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.