టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్* *రాజకీయ వారసత్వం.. పార్టీ పట్ల అంకితభావం* . *మంత్రి అండదండలు పుష్కలం* *ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ*
*
టెక్కలి: టెక్కలి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో కోళ్ల లవకుమార్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ వెనకడుగు వేయకుండా పార్టీ శ్రేణులను, కార్యకర్తలను తనవంతుగా కాపాడుకుంటూ ముందుకు నడిపిన వ్యక్తిగా లవకుమార్‌కు గుర్తింపు ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
గతంలో అధికారంలో ఉన్న పార్టీ హయాంలో ఎదురైన రాజకీయ కేసులు, ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పార్టీ కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, కేడర్‌తో ఉన్న అనుబంధం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక అంశాలుగా నిలిచాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
అదేవిధంగా
*కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఆశీస్సులు*
, అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని ఆయన వర్గాలు భావిస్తున్నాయి. అయితే సర్పంచ్ అభ్యర్థిత్వంపై మంత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండటంతో ఆయన వర్గం మంత్రి మాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా లవకుమార్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది. తన చిన్నాన్న *స్వర్గీయ కోళ్ల అప్పన్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా జీవితంలో ముందుకు సాగాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తన *తాత కోళ్ల భీముడుకు సర్దార్ గౌతు లచ్చన్న*
తో ఉన్న స్నేహ సంబంధాలను కూడా కుటుంబ రాజకీయ చరిత్రలో భాగంగా ప్రస్తావిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి లవకుమార్ తనవంతు కృషి చేసినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో ఆయన పాత్రపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల లవకుమార్ అయితే పార్టీని సమర్థవంతంగా నడిపించి టెక్కలి పట్టణాన్ని సర్వాంగ సుద్దారంగా తీర్చిదిద్ది అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని ప్రజలు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..