BREAKING
అగస్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ కన్నుమూత కార్తీక ఉపవాసం - విశిష్టత టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్* *రాజకీయ వారసత్వం.. పార్టీ పట్ల అంకితభావం* . *మంత్రి అండదండలు పుష్కలం* *ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ* స్వీడన్ రాజకీయాల్లో కీలక మలుపు: ఎన్విడియా నాయకత్వ మార్పులపై టెక్ వర్గాల్లో ఊహాగానాలు సెన్సెక్స్ 81,592, నిఫ్టీ 25,144 వద్ద స్థిరపడిన మార్కెట్లు: సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ కన్నుమూత

Select Suryaa Now
మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ కన్నుమూత

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని మెట్లకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ జయకృష్ణ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు కన్నయ్య తెలిపారు.జయకృష్ణ మృతి వార్త తెలియడంతో మెట్లకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మండలానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, సహచర నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆప్తమిత్రుడిని కోల్పోయామని, మా నుంచి దూరమయ్యావా మిత్రమా.. నీవు లేని లోటును ఎలా భరించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.