ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
పటాన్ చెరు ; పటాన్ చెరు జేపీ కాలనీ జిహెచ్ఎంసి డివిజన్ పరిధిలోని బండ్లగూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, హైదరాబాద్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా దున్నపోతుల విన్యాసాలు, అలంకరణలు, ఉత్సాహభరితమైన సంబరాలతో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించబడతాయి.యాదవుల వీరత్వం, పశుసంపదపై వారి అనుబంధం, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను చాటిచెప్పే ఈ సదర్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.