BREAKING
​రూ. 5 కోట్ల కోసం నకిలీ సీబీఐ అధికారుల అవతారంలో కిడ్నాప్.. 4 రోజుల్లోనే కేసును ఛేదించి, వ్యాపారిని రక్షించిన మదనపల్లె పోలీసులు డాలర్‌తో మారకంలో ఊగిసలాటలో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు కలకలం అమెరికా రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం చైనాలో మందగించిన ఆర్థిక వృద్ధి..రిటైల్ విక్రయాలు హైట్రీ కల్లోలం మధ్య హైతీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మాజీ ప్రథమ మహిళ కృత్రిమ మేధస్సు ఆయుధాలపై అంతర్జాతీయ చర్చలకు గండి ధనాపురం సర్పంచ్ రేసులో ఎ. మంగమ్మ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం.. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పోటీకి సిద్ధం! నేటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజుల పర్యటనసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష. ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ ఆడుకోవడానికి వెళ్లి.. అనంత లోకాలకు షాద్‌నగర్ విద్యార్థిని అవంతికకు రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో తృతీయ బహుమతి రామచంద్ర మజ్జికి రెడ్డి శాంతి సన్మానం

షాద్‌నగర్ విద్యార్థిని అవంతికకు రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో తృతీయ బహుమతి

Select Suryaa Now
షాద్‌నగర్ విద్యార్థిని అవంతికకు రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో తృతీయ బహుమతి

- కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా రూ.25 వేల నగదు పురస్కారం…

ఫరూక్ నగర్ రంగారెడ్డి 

 

 రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షల్లో షాద్‌నగర్ పట్టణానికి చెందిన విద్యార్థిని అవంతిక ప్రతిభ చాటింది. గోసేవ విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కాలేజీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలు-2026లో షాద్‌నగర్ ఠాగూర్ పాఠశాలకు చెందిన అవంతిక తృతీయ స్థానంలో నిలిచి బహుమతి సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,001 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అవంతికకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా రూ.25 వేల నగదు చెక్కుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థినిని అభినందించారు.

ఈ పరీక్షల్లో షాద్‌నగర్ పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనగా, నిర్వాహకులు వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోసేవ షాద్‌నగర్ ఇన్‌చార్జి సుభాష్ రెడ్డి, ఉపాధ్యాయులు అర్మాల్ రవి ప్రకాష్, వీరేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించిన అవంతికను ఠాగూర్ పాఠశాల చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాల్ అంజలి దేవి, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.