రామచంద్ర మజ్జికి రెడ్డి శాంతి సన్మానం
మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్.
మెళియాపుట్టి మండలం కేరాసింగి ఎంపీటీసీగా విజయం సాధించిన రామచంద్ర మజ్జిని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నంలో ఘనంగా సత్కరించారు. మెళియాపుట్టి, మర్రిపాడు-సి స్థానాల్లో పోటీ చేసిన బొంతు గీత, బైరిసింగి ధరణిలను అభినందించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు మనోధైర్యంతో పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పోలాకి జయమునిరావు, పరపటి రవికుమార్, బొంతు రవి తదితరులు పాల్గొన్నారు.
అనపాన నాగిరెడ్డి... మెలియాపుట్టి..