గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు: ఎస్సె
మెలియాపుట్టి నవంబర్ 16. మేజర్ న్యూస్…
కొత్తూరు మండలంలోని గ్రామాల్లో ప్రత్యేకంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలోని కుంటి భద్ర గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్థానిక గ్రామస్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఘర్షణలకు పోకుండా సమన్వయంతో పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. ఇప్పటికే పలువురిపై బైండోవర్కేసులు నమోదు చేశామన్నారు.
అనపాన నాగిరెడ్డి. మెలియాపుట్టి