BREAKING
అమెరికా జాతీయ ఛాంపియన్‌లుగా ఎన్విడియా, ఇతర ఏఐ దిగ్గజాలు ఆసియా మార్కెట్లలో మారుతున్న గెలుపు ఓటముల సమీకరణాలు దివంగత నటి నిమ్మి ఆస్తుల కబ్జా వివాదం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం 3.4 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధం సైబర్ భద్రతా ఉల్లంఘనపై కోల్స్ దర్యాప్తు కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు.. 5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి సిద్ధమవుతున్న డైమండ్‌బ్యాక్ పారిశ్రామిక రంగానికి ఈయూ భారీ ఊరట ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ టాటా మోటార్స్‌కు గట్టి షాక్ దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉత్సాహభరితారంభం కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఐపీఓ ప్రకటన కారు దాడిలో రెండు కాళ్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఎంపీ ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోదీ

కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు..

Select Suryaa Now
కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు..

 సూర్య వీణవంక :కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో మోటార్ వైర్ల చోరీలు జరుగుతుండటంతో రైతులు, గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వ్యవసాయ బావుల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లకు సంబంధించిన వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
గతంలో కూడా గ్రామ పరిధిలో మోటార్లు, వైర్లు చోరీకి గురైన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.