BREAKING
ఎన్విడియా ఫలితాలు, ఆంత్రోపిక్ ఐపీఓ ముందస్తు ప్రభావంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు ఐటీఓ ఘాట్ వద్ద ఉషా అర్ఘ్యం సమర్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అమెరికా జాతీయ ఛాంపియన్‌లుగా ఎన్విడియా, ఇతర ఏఐ దిగ్గజాలు ఆసియా మార్కెట్లలో మారుతున్న గెలుపు ఓటముల సమీకరణాలు దివంగత నటి నిమ్మి ఆస్తుల కబ్జా వివాదం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం 3.4 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధం సైబర్ భద్రతా ఉల్లంఘనపై కోల్స్ దర్యాప్తు కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు.. 5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి సిద్ధమవుతున్న డైమండ్‌బ్యాక్ పారిశ్రామిక రంగానికి ఈయూ భారీ ఊరట ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ టాటా మోటార్స్‌కు గట్టి షాక్ దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉత్సాహభరితారంభం కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఐపీఓ ప్రకటన

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

Select Suryaa Now
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

సూర్య,కాగజ్‌నగర్:సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం (16-11-2026) తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర ఆధారాలు లభించలేదు. అతని ఎడమ చేతిపై పచ్చబొట్టు (టాటూ) ఉంది. చిన్న వెంట్రుకలు, చిన్న గడ్డం కలిగి ఉండి, నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినవారు వెంటనే రైల్వే హెడ్ కానిస్టేబుల్ కే. సురేష్ గౌడ్‌ను సంప్రదించాలని కోరారు.

సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
- 9948481901
- 8712658596

మృతుడిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.