శ్రీ సిద్ధి హనుమాన్ - టోంకిని మహా పాదయాత్రకు విచ్చేస్తున్న భక్తులకు జిల్లా పోలీస్ శాఖ స్వాగతం - పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ ఐ.పి.ఎస్
సూర్య సిర్పూర్ (టి) :
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీ సిద్ధి హనుమాన్ - టోంకిని మహా పాదయాత్రకు విచ్చేస్తున్న భక్తులకు జిల్లా పోలీస్ శాఖ స్వాగతం పలుకుతుంది.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వహీదుద్దీన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎస్ఐ. ఏ. వెంకటేష్ భక్తులకు పలు సూచనలు చేశారు.
పాదయాత్రలో దొంగలు ఉండవచ్చు కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉండాలి. తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకతాయిలు ఈవ్ టీజింగ్ చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. భక్తులు క్యూ పద్ధతిని పాటించాలి. అపరిచితులకు ఎలాంటి వస్తువులను ఇవ్వవద్దు, తీసుకోవద్దు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే నిలపాలి. నియమాలను పాటించి పాదయాత్ర విజయవంతం కావడానికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
- భక్తులకు ముఖ్య గమనిక :- నదిలో ముసళ్ళు ఉన్నవి, నదిలోకి స్నానానికి వెళ్ళడం, లోనికి దిగడం నిషేధించబడినది.
ఏదైనా ఇబ్బందులు ఎదురైనచో వెంటనే సి.ఐ. కౌటాల, సెల్ : 8712670512
ఎస్.ఐ. వెంకటేష్: 8712670544 సమాచారo అందించాలని అన్నారు.
సి.ఐ. కౌటాల, సెల్ : 8712670512
ఎస్.ఐ. వెంకటేష్: 8712670544 సంప్రదించాలని వారు కోరారు.