మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్
మెలియాపుట్టి మండల కేంద్రంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయములో కార్తీక సోమవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు త్రినాధ్ స్వామి రథో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ, ఓం నమశివాయ స్మరిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
అనపాన నాగిరెడ్డి. మెలియాపుట్టి.