*పోలింగ్ స్టేషన్ నెం. 45/1, 45/2 లను తనిఖీ చేసిన కమిషనర్*
తాడేపల్లిగూడెం సూర్య న్యూస్: పురపాలక సంఘం సాధారణ మున్సిపల్ ఎన్నికలు - 2026 కు సంబంధించి మున్సిపల్ కమిషనర్ యం. యేసుబాబు. ఈరోజు _పోలింగ్ స్టేషన్ నెం. 45/1 మరియు 45/2_ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన వసతులను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యం, విద్యుత్, టాయిలెట్స్, ర్యాంప్ సౌకర్యం తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.