నేటి స్టాక్ మార్కెట్ హైలైట్స్: క్యూ2 ఫలితాలు, రూ. 215 కోట్ల పన్ను ఊరట నేపథ్యంలో ఫోకస్‌లో ఉండే టాప్ షేర్లు!
సూర్య బిజినెస్ & మార్కెట్ డెస్క్ (ముంబై): దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 16, 2026) ఉదయం గిఫ్ట్ నిఫ్టీ సానుకూల సంకేతాలతో వారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. త్రైమాసిక ఫలితాలు , కొత్త ఆర్డర్లు మరియు కార్పొరేట్ ప్రకటనల నేపథ్యంలో నేటి ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించాల్సిన తొమ్మిది కీలక షేర్ల వివరాలను ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్: సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 5,531 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం ఇన్వెస్టర్లలో చర్చనీయాంశమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వన్-టైమ్ లాభం కారణంగా రూ. 76,170 కోట్ల లాభం నమోదైంది. అయితే ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం ఏకంగా 34 శాతం పెరిగి రూ. 96,920 కోట్లకు చేరడం, జేఎల్ఆర్ ఆదాయం 20.3 శాతం వృద్ధి చెందడం సానుకూల అంశాలుగా ఉన్నాయి.
కేన్స్ టెక్నాలజీ : సంస్థ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.4 శాతం పెరిగి రూ. 952.5 కోట్లుగా నమోదైంది. అయితే నిర్వహణ లాభం 15.7 శాతం తగ్గి రూ. 126.5 కోట్లకు పరిమితం కాగా, నికర లాభం 61.6 శాతం క్షీణించి రూ. 45.4 కోట్లుగా నమోదవడంతో నేడు ఈ షేరుపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
యెస్ బ్యాంక్ : బ్యాంక్ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయని, ప్రభుత్వ ఖాతాలకు నష్టం వాటిల్లిందని వస్తున్న వార్తలను యెస్ బ్యాంక్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తమ వ్యవస్థలన్నీ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టం చేయడంతో ఈ స్టాక్ నేడు ఫోకస్‌లో నిలిచింది.
వా టెక్ వాబాగ్ : యాన్బు వద్ద 300 ఎంఎల్‌డీ సముద్రపు నీటి శుద్ధి ప్లాంట్ ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన పరిణామాలతో పాటు, నేడు ముంబైలో జరగనున్న అవెండస్ స్పార్క్ ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ యాజమాన్యం పాల్గొననుండటంతో ఈ షేరుపై మదుపరులు దృష్టి సారించారు.
దీపక్ ఫెర్టిలైజర్స్ : రూ. 215 కోట్ల పన్ను వివాదంలో ముంబైలోని ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి కంపెనీకి భారీ ఊరట లభించింది. ఈ తీర్పు నేపథ్యంలో నేడు షేరు సానుకూలంగా కదిలే అవకాశం ఉంది.
సమ్మాన్ క్యాపిటల్, జూపిటర్ వ్యాగన్స్ & టీవీఎస్ ఎలక్ట్రానిక్స్: సమ్మాన్ క్యాపిటల్ నికర వడ్డీ ఆదాయం రూ. 138.06 కోట్ల ప్రతికూల స్థాయికి చేరినప్పటికీ, త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 28.4 శాతం పెరిగింది. జూపిటర్ వ్యాగన్స్ఆదాయం 1.8 శాతం తగ్గి రూ. 772.2 కోట్లకు, ఎబిట్డా 9.3 శాతం తగ్గి రూ. 94.3 కోట్లకు చేరింది. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ వార్షిక ఆదాయం 9.4 శాతం తగ్గినప్పటికీ, గత త్రైమాసికంతో పోలిస్తే నికర నష్టాన్ని తగ్గించుకోగలిగింది.
ఐషర్ మోటార్స్: రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు స్థాయిలో 3.76 లక్షల బైక్‌లను విక్రయించడంతో కంపెనీ క్యూ2 నికర లాభం 15 శాతం పెరిగి రూ. 1,573 కోట్లకు చేరింది. దీంతో పాటు ప్రికాల్ ఆటోటెక్‌లో వార్‌బర్గ్ పింకస్ రూ. 1,663 కోట్లతో వాటా కొనుగోలు చేయనుండటంతో ఆయా షేర్లు నేడు మార్కెట్లో కీలకంగా కదలనున్నాయి.