ఆకుతోటపల్లి సర్పంచ్ స్థానానికి కూటమి అభ్యర్థి రాగే సరస్వతి నామినేషన్
ఆకుతోటపల్లి సర్పంచ్ స్థానానికి కూటమి అభ్యర్థి రాగే సరస్వతి నామినేషన్
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురము రూరల్ మండలం ఆకుతోటపల్లి సర్పంచ్ స్థానానికి టిడిపి క్లస్టర్ ఇంచార్జ్, రాగే మురళి సతీమణి రాగే సరస్వతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాలతో టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో ఆమె నిలిచారు. విద్యావంతురాలైన, ఉన్నత విద్యను అభ్యసించిన సరస్వతి.. సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే.. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని తెలిపారు.