BREAKING
నేటి స్టాక్ మార్కెట్ హైలైట్స్: క్యూ2 ఫలితాలు, రూ. 215 కోట్ల పన్ను ఊరట నేపథ్యంలో ఫోకస్‌లో ఉండే టాప్ షేర్లు! క్రీడలతో మానసిక ఉల్లాసం స్వీడన్‌లో వీడిన రాజకీయ ప్రతిష్టంభన: షరతులతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సెంటర్ పార్టీ అంగీకారం! *పోలింగ్ స్టేషన్ నెం. 45/1, 45/2 లను తనిఖీ చేసిన కమిషనర్* రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి పోలీసుల తక్షణ సహాయం స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ ఎన్విడియా నాయకత్వ మార్పులపై టెక్ వర్గాల్లో ఊహాగానాలు భారత్–ఈజిప్ట్ వాణిజ్య బంధంలో కీలక అడుగు ఆకుతోటపల్లి సర్పంచ్ స్థానానికి కూటమి అభ్యర్థి రాగే సరస్వతి నామినేషన్ ​రూ. 5 కోట్ల కోసం నకిలీ సీబీఐ అధికారుల అవతారంలో కిడ్నాప్.. 4 రోజుల్లోనే కేసును ఛేదించి, వ్యాపారిని రక్షించిన మదనపల్లె పోలీసులు డాలర్‌తో మారకంలో ఊగిసలాటలో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు కలకలం అమెరికా రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం చైనాలో మందగించిన ఆర్థిక వృద్ధి..రిటైల్ విక్రయాలు

రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి పోలీసుల తక్షణ సహాయం

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి పోలీసుల తక్షణ సహాయం

సూర్య జగిత్యాల ప్రతినిధి:ఆపదలో ఉన్న ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి వేళ తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించిన బుగ్గారం పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోట్ కానిస్టేబుల్ సంపత్‌ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.వివరాల్లోకి వెళితే.. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వేముల సాయికుమార్ మద్దునూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్‌కు తన కారులో వెళ్తుండగా, మద్దునూర్ గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో బాధితుడు సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించిన బాధితుడి మొబైల్ ఫోన్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు 112కు కాల్ చేసి ప్రమాద సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ సంపత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.గోతిలో పడిన కారులో ఉన్న బాధితుడు వేముల సాయికుమార్‌ను గుర్తించి, అతనికి అవసరమైన తక్షణ సహాయం అందించి సురక్షితంగా రక్షించారు.అర్ధరాత్రి సమయం, నిర్మానుష్య ప్రాంతం అయినప్పటికీ విధి నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించి బాధితుడికి అండగా నిలిచారు.