టోంకిని పాదయాత్ర.. భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం - ఎస్ఐ వెంకటేష్
సూర్య సిర్పూర్ (టి): ప్రసిద్ధిచెందిన టోoకిని హనుమన్ మందిర్ లో రేపు 17వ తేదీన నిర్వహించనున్న టోంకిని పాదయాత్ర నేపథ్యంలో సిర్పూర్ (టి) నుంచి కౌటాల వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.పాదయాత్ర సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వాహనాలు సిర్పూర్ (టి) నుంచి కౌటాల మార్గంలో వెళ్లకుండా, కాగజ్‌నగర్ నుంచి ఈస్గాం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు.వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఎస్ఐ వెంకటేష్ కోరారు.