BREAKING
ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను ఎన్విడియా ఫలితాలు, ఆంత్రోపిక్ ఐపీఓ ముందస్తు ప్రభావంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు ఐటీఓ ఘాట్ వద్ద ఉషా అర్ఘ్యం సమర్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అమెరికా జాతీయ ఛాంపియన్‌లుగా ఎన్విడియా, ఇతర ఏఐ దిగ్గజాలు ఆసియా మార్కెట్లలో మారుతున్న గెలుపు ఓటముల సమీకరణాలు దివంగత నటి నిమ్మి ఆస్తుల కబ్జా వివాదం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం 3.4 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధం సైబర్ భద్రతా ఉల్లంఘనపై కోల్స్ దర్యాప్తు కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు.. 5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి సిద్ధమవుతున్న డైమండ్‌బ్యాక్ పారిశ్రామిక రంగానికి ఈయూ భారీ ఊరట

రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణం 2వ వార్డుకు చెందిన రామగిరి మమత మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతూ, చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతుండగా  స్థానిక కౌన్సిలర్ దయాల చంద్రకళ శంకర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  మమతకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెదడు సంబంధిత చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగిరి మమత కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయాల శంకర్,సర్పంచులు ఆకుల మల్లేశం, నక్క హరీష్, ఆకుల తిరుపతి, రాజన్న గౌడ్,తోట లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.