BREAKING
గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను

భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా

Select Suryaa Now
భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం    ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ సినిమాలు, వినోదం తాత్కాలికమని, భారతీయ శాస్త్రీయ నృత్య, సంగీత కళలే శాశ్వతమని ప్రముఖ సినీ సంభాషణల రచయిత మరుధూరి రాజా పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్ధానం ప్రాంగణంలో జరిగిన 
రాఘవ నృత్య సంగీత కళానిలయం ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలకు చదువుతో పాటు కళలను నేర్పించడం ద్వారానే వారిలో సంస్కారం, వ్యక్తిత్వం వికసిస్తాయన్నారు. ప్రముఖ సినీ నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ.. "కళలను ప్రోత్సహించడమంటే మన భావి తరాలకు మన గుర్తింపును అందించడమేనని పేర్కొన్నారు. 
ప్రముఖ నృత్య కళా గురువు రుద్రవరపు కనకదుర్గ మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎంత పెరిగినా మన మూలాలు, సంస్కృతి కళలలోనే ఉంటాయని తెలిపారు. ప్రాథమిక పాఠశాల దశ నుంచే బాలబాలికలకు సంగీతం, నృత్యం నేర్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రముఖ వీణ విద్వాంసురాలు, సంగీత శిక్షకురాలు తూములూరి నాగలక్ష్మి కోరారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత, విశ్రాంత తెలుగు పండితులు భువనగిరి పురుషోత్తం అధ్యక్షత వహించిన కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఛైర్మన్
ఎం. వాసుదేవరావు, మేనేజర్ 
కే. సర్వేశ్వర శాస్త్రి, లలిత కళారాధకులు మద్దాలి శ్రీనివాస్, వికారాబాద్ వెటర్నరీ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ కరవది నాగపూర్ణ చంద్రరావు, హైదరాబాద్ పెస్టిసైడ్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ కరవది శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. అతిథులను సంస్థ నిర్వాహకులు కరవది సాయిశరణ్య, సాయిశ్రావ్య ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలకు ఆల్వకొండ సుమంత్, మద్దాలి జశ్వంత్, కరవది నాగ లక్ష్మి నిర్వహణా సహకారం అందించారు. సభకు ముందు కరవది శ్రీనివాస్ కుమార్ ప్రదర్శించిన 'రావణ బ్రహ్మ' ఏకపాత్రాభినయంతో పాటు 
 శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.