BREAKING
గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను

భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం

Select Suryaa Now
భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 15: నిష్కల్మషమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఉన్నచోట భగవంతుడు తప్పక కొలువై ఉంటాడని సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా అన్నారు. భక్తి, విశ్వాసాలే మనిషికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. ఆశ్రమంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాలను, నీళ్లను వేరు చేసే హంస మాదిరిగా మనిషి కూడా భ్రాంతులను వీడి ఈశ్వరతత్వం వైపు పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమలోని ఆత్మతత్వాన్ని తెలుసుకుని 'అహం బ్రహ్మాస్మి' అనే ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవాలని ఆకాంక్షించారు. మతమంటే భగవంతుడిని చేరుకునే మార్గమని, మార్గాలు వేరైనా చేరుకునే గమ్యం ఒక్కటేనని వివరించారు. శిఖరాన్ని చేరుకున్నప్పుడు అన్ని మార్గాలు ఒకటిగానే కనిపిస్తాయని పేర్కొన్నారు. కష్టాల్లోనూ భగవంతుడిని స్మరిస్తూ ముందుకు సాగే భక్తులకు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ అండగా ఉంటాడని తెలిపారు. మనిషి ఒక నడిచే దేవాలయమని, మానవత్వాన్ని మించిన మతం లేదని ఉద్బోధించారు. మానవత్వమే ఈశ్వరతత్వమని స్పష్టం చేశారు.