BREAKING
డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ అప్పాల బాలయ్య యాదవ్‌కు ప్రముఖుల నివాళులు నేడు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు భక్తిశ్రద్ధలతో ఛట్ పూజ కార్యక్రమం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేట్ శక్తుల కుట్రలకు అల్తాస్ జానయ్యను బలికానివ్వం బొగ్గు బ్లాక్ లన్ని సింగరేణికే కేటాయించాలి భారీ లాభాల్లో సూచీలు గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్

Select Suryaa Now
గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : గోసంరక్షణను సామాజిక, ఆర్థిక, పర్యావరణ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు . భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోవు కీలక పాత్ర పోషిస్తుందని, గోవిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఆదివారం నారాయణగూడలోని సర్దార్ పటేల్ ఆడిటోరియం లో నిర్వహించిన రాష్ట్రస్థాయి 'గోవిజ్ఞాన పరీక్షలు–2026' బహుమతుల ప్రదానోత్సవంలో గవర్నర్ ప్రసంగించారు. గోసంరక్షణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అనంతరం పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.