telangana
భక్తిశ్రద్ధలతో ఛట్ పూజ కార్యక్రమం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం ఆవరణలో “ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్” ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులుదేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర భారతీయ సోదర సోదరీమణులు ఆచరిస్తున్న ఛట్ పూజ దేశం యొక్క సమగ్ర సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు.సూర్యుని ఆరాధించే ఈ పూజలో భక్తులు నది తీరాల వద్ద ఉపవాస దీక్షలు,పండ్ల నైవేద్యాలు సమర్పించడం ద్వారా కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సంస్కారం ఉందని పేర్కొన్నారు.సూర్య దేవుడు,ఉషోదయ పూజ,అష్టమి పర్వదినాల విశిష్టతను గుర్తుచేస్తూ భక్తుల ఆరోగ్యం,సుఖశాంతి,కుటుంబ సుభిక్షత,రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రార్థించారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతి ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ మాజీ ధర్మకర్త మధుసాగర్,ఆలయ సిబ్బంది ప్రసాద్,ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ సభ్యులుఎన్.కే.సింగ్, మరియు సంఘ్ పరివార్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.