BREAKING
అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ అప్పాల బాలయ్య యాదవ్‌కు ప్రముఖుల నివాళులు నేడు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు భక్తిశ్రద్ధలతో ఛట్ పూజ కార్యక్రమం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేట్ శక్తుల కుట్రలకు అల్తాస్ జానయ్యను బలికానివ్వం బొగ్గు బ్లాక్ లన్ని సింగరేణికే కేటాయించాలి భారీ లాభాల్లో సూచీలు గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా

అప్పాల బాలయ్య యాదవ్‌కు ప్రముఖుల నివాళులు నేడు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు

Select Suryaa Now
అప్పాల బాలయ్య యాదవ్‌కు ప్రముఖుల నివాళులు  నేడు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు

జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాల బాలయ్య యాదవ్ అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజలు, నాయకులు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచారు. సోమవారం పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆదివారం పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు బాలయ్య యాదవ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) హైదరాబాద్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ నవీనాచారి, మహారాష్ట్ర అధ్యక్షుడు సులిగి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కిషోర్ తదితరులు హాజరై నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అలాగే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదులు చంద్రశేఖర్, శ్రీనివాస్ కూడా బాలయ్య యాదవ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. విష్ణువర్ధన్ రెడ్డి అంత్యక్రియల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు,బంధువులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.