BREAKING
అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ అప్పాల బాలయ్య యాదవ్‌కు ప్రముఖుల నివాళులు నేడు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు భక్తిశ్రద్ధలతో ఛట్ పూజ కార్యక్రమం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేట్ శక్తుల కుట్రలకు అల్తాస్ జానయ్యను బలికానివ్వం బొగ్గు బ్లాక్ లన్ని సింగరేణికే కేటాయించాలి భారీ లాభాల్లో సూచీలు గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా

బొగ్గు బ్లాక్ లన్ని సింగరేణికే కేటాయించాలి

Select Suryaa Now
బొగ్గు బ్లాక్ లన్ని సింగరేణికే కేటాయించాలి
.హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ : తెలంగాణకు తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థను పరిరక్షించడంతోపాటు, కోయగూడెం-3, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అవసరమైతే కార్మికులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి కె. రాజకుమార్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఎం. నరసింహ మాట్లాడుతూ  తెలంగాణలో నిరుద్యోగ యువతకు, కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ప్రధాన సంస్థ సింగరేణి మాత్రమేనని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు జరగడం లేదని పేర్కొన్నారు. సింగరేణిని పరిరక్షించడంతోపాటు కొత్త బొగ్గు గనులను ప్రారంభించి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వం స్పందించకపోతే ఏఐటియుసి కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.అనంతరం వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం ఓసీ-3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎండీఆర్ చట్టం కారణంగా తెలంగాణలోని బొగ్గు గనులను సైతం వేలం వేస్తున్నారని తెలిపారు. గతంలో కొత్తగా గుర్తించిన గనులను సింగరేణికే కేటాయించే విధానం ఉండేదని, ప్రస్తుతం వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి వేలంలో పాల్గొనవద్దని ఆదేశించిందని తెలిపారు. ఏఐటీయూసీ ఆందోళనల ఫలితంగా కోయగూడెం గనికి సంబంధించి అరబిందో కంపెనీ కేటాయింపు రద్దయిందని గుర్తుచేశారు.ఈ నెల 17న బిడ్లు దాఖలు కానుండగా, డిసెంబర్ 1న వేలం ప్రక్రియ జరగనుందని తెలిపారు. సింగరేణితోపాటు ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో, ఏపీ జెన్‌కో, పలు ప్రైవేటు సంస్థలు బిడ్డింగ్ పత్రాలు తీసుకున్నట్లు సమాచారం ఉందన్నారు.  ప్రైవేటు సంస్థలు బొగ్గు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.కాగా,ప్రధానకార్యదర్శి కె. రాజకుమార్ మాట్లాడుతూ కోయగూడెం-3, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  మరో 20 ఏళ్ల తర్వాత బొగ్గు గనుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, కొత్త ప్రాజెక్టులు రాకపోతే సుమారు 80 వేల మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ఎండీ అక్బర్ అలీ, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు కె.డబ్ల్యూ. క్రిస్టాఫర్, వర్కింగ్ మహిళా ఫోరమ్ కన్వీనర్ పి. ప్రేమ పావని, ఐ. లింగయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రామాంజనేయులు, రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.