telangana
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్ కోసం సైక్లింగ్ ర్యాలీ
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా నషా ముక్త్ భారత్ (మాదకద్రవ్య రహిత భారతదేశం) సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేతలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు, లంకల దీపక్‌రెడ్డి, భరత్ గౌడ్, బద్దం మహిపాల్‌రెడ్డి, ఆనంద్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కుంబాల గంగరాజ్, ప్రేమ్‌కుమార్, జ్ఞానేశ్వర్ బరిగెల, ఫణికుమార్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు, వక్తలు పిలుపునిచ్చారు.