BREAKING
గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు! అమెరికా అధ్యక్షుడి పర్యటనకు ముందే చైనా ప్రధాని కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని.

నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని.

Select Suryaa Now
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని.

కళ్యాణదుర్గం: నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే ప్రతి అక్షరం సమాజంలో మార్పునకు తొలి మెట్టు అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత్రికేయ మిత్రులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల బాధ్యతలను గుర్తుచేస్తూ ప్రజల గొంతుకగా నిలిచి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం ఎంతో బాధ్యతతో కూడుకున్న వృత్తి అని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయని, వార్తల విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ వాస్తవాల ఆధారంగా వార్తలను ప్రచురించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు, రైతుల ఇబ్బందులు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు సమాచారం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నిష్పక్షపాతంగా, నిబద్ధతతో పనిచేసే ప్రతి పాత్రికేయుడికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాత్రికేయులందరూ ఆయురారోగ్యాలతో, వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆకాంక్షించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.