తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. కాగా, నిన్న ఒక్కరోజే 82,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,058 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.95 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.