telangana
హలో నేతకాని --చలో ఉస్మానియా
హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ :షెడ్యూల్డ్ కులాల (SC) వర్గీకరణలో నేతకానీ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ, రాజ్యాంగబద్ధ సాధనకై ఉస్మానియా విశ్వవిద్యాలయం వేది "నేతకానిల పోరుబాట – హలో నేతకాని చలో ఉస్మానియా" కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, నేతకానిల హక్కుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమానికి చైర్మన్ ప్రొఫెసర్ జాడి ముసలయ్య, కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత, వైస్ చైర్మన్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు జాడి దేవేంద్ర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.