BREAKING
గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు! అమెరికా అధ్యక్షుడి పర్యటనకు ముందే చైనా ప్రధాని కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని.

కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై మల్కాజిగిరి ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు

Select Suryaa Now
కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై మల్కాజిగిరి ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు
మల్కాజిగిరి జిల్లాలో కల్తీ కల్లు తయారీ, విక్రయాలు మరియు నిషేధిత రసాయన పదార్థమైన క్లోరల్ హైడ్రేట్ (Chloral Hydrate) అక్రమ సరఫరాపై జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు మరియు దాడులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో, 13.11.2026న మల్కాజిగిరి DTF బృందం, SHO మల్కాజిగిరితో కలిసి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని TCS ఈస్ట్ ఆనంద్‌బాగ్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో కల్లులో క్లోరల్ హైడ్రేట్ (CH) కలిపినట్లు గుర్తించడంతో, పంచనామా సమక్షంలో నమూనాలు సేకరించి, మొత్తం 163 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
అనంతరం, DTF బృందం SHO నాచారంతో కలిసి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని TCS అశోక్ నగర్‌లో తనిఖీలు నిర్వహించింది. అక్కడ కూడా కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు గుర్తించి, పంచనామా సమక్షంలో నమూనాలు సేకరించారు. మొత్తం 101 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేయడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
అదేవిధంగా, కల్తీ కల్లులో ఉపయోగిస్తున్న క్లోరల్ హైడ్రేట్ సరఫరా మూలాలను గుర్తించే దర్యాప్తులో భాగంగా, సరఫరాదారుడైన సిద్ధగోని రంగయ్యను యాదాద్రి భువనగిరి జిల్లాలోని పిలాయిపల్లి గ్రామంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 25 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రసాయన సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, నెట్‌వర్క్ మరియు సరఫరా మార్గాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ మూడు ప్రత్యేక చర్యల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 25 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 264 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేశారు.
క్లోరల్ హైడ్రేట్ వంటి నిషేధిత రసాయన పదార్థాలను కల్లులో కలపడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఇటువంటి కల్తీ కల్లును సేవించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటమాడే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎక్సైజ్ శాఖ ఏమాత్రం సహించదు.
జిల్లాలో కల్తీ కల్లు తయారీ, విక్రయాలు మరియు నిషేధిత రసాయనాల అక్రమ సరఫరాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, బాధ్యులందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తరహా అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే సమీప ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరుతోంది. ప్రజల సహకారంతో జిల్లాలో కల్తీ కల్లు మరియు నిషేధిత రసాయనాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది.
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి,