59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
పలమనేరు మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన 16-11-2026న శాఖా గ్రంథాలయం, పలమనేరు నందు గ్రంథాలయ ఉద్యమానికి విశేష కృషి చేసిన ప్రముఖులు డా. ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య తదితరులను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రశేఖరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రంథాలయ ఉద్యమ పితామహుల యొక్క కృషి వల్ల సోమవారం గ్రంథాలయాలు ప్రతి పల్లెలోనూ వాడలోని వెలశాయి. ఈ గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం గ్రంథాలయాధికారి హేమంత్ కుమార్ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకర్త మధుమోహన్ రావు, పుర ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్