పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!
బత్తలపల్లి మేజర్ న్యూస్: స్థానిక పంచాయతీ ఎన్నికల సమరం వేడెక్కడంతో పోట్లమర్రి సర్పంచ్ స్థానానికి అభ్యర్థిగా నెట్టెం శకుంతలమ్మ సోమవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గంటాపురం గ్రామం నుండి ఆమె గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు.
గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగిన ఈ ర్యాలీలో వందలాదిగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పాల్గొన్నాయి. శకుంతలమ్మకు మద్దతుగా ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే గెలుపుపై ఆమె వర్గంలో ధీమా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సందర్భంగా నెట్టెం శకుంతలమ్మ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆశీస్సులతోనే తాను బరిలో నిలిచానని, పోట్లమర్రి సమಗ್ರ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించిన అనంతరం నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.