andhrapradesh
వసతి గృహాలలో దోమతెరలు పంపిణీ
తెనాలి, న్యూస్ : పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాలలో విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా సోమవారం దోమతెరలను పంపిణీ చేశారు. నందుల పేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ సుశాన్ గ్రేస్, మారీసుపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ దోమతెరల వినియోగం ద్వారా దోమకాటుకు గురికాకుండా ఉంటారని అన్నారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వ్యాధి, జికా వైరస్ వంటి వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చని తెలిపారు. మలేరియా ఇన్చార్జ్ సబ్ యూనిట్ అధికారి గుద్దంటి రవికుమార్ మాట్లాడుతూ దోమతెరల వల్లఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల వైస్ ప్రిన్సిపాల్స్ అనంతలక్ష్మి, సాయి దుర్గ, మలేరియా సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు శివ నాగమల్లేశ్వరరావు, దాసరి శివ నాగమల్లేశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకురాలు పుష్పలత, హెల్త్ అసిస్టెంట్స్ వేణుగోపాలరావు, రషీద్, నవీద్, శరత్ బాబు, దీపాల శ్రీనివాసరావు, కరీముల్లా మరియు ఫైలేరియా సిబ్బంది రత్నాకర్ రావు, ఆలీ, బషీద్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.