తాడేపల్లి మేజర్ న్యూస్ మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ తొలి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 62 డివిజన్లు మరియు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయిన మేయర్ పదవికి నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు:నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ఎత్తున తరలివచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ ఎన్నికల్లో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) తరఫున మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పేరం ఏడుకొండలు తన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు.