కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్
కురుగుంట సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి మద్దతుదారుడు మాధవరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కురుగుంట లోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలను తన మద్దతు దారులతో కలిసి అందజేశారు. నామినేషన్ అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు... కురుగుంట గ్రామపంచాయతీకి.. వైసీపీ మద్దతుతో సర్పంచిగా పోటీ చేస్తున్నానని, పంచాయతీ ప్రజలు... నన్ను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాలనీలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన కోసం పని చేస్తానని.. తెలిపారు.