మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు కార్యక్రమ విజయవంతానికి ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సమీక్ష
పలమనేరు మేజర్ న్యూస్ ఈ నెల 23న జరగనున్న పలమనేరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి, కూటమి పార్టీల కౌన్సిలర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.పలమనేరు మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పీఠాన్ని అధిష్ఠించనున్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా 23వ తేదీన చేపట్టనున్న ర్యాలీ, నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, బహిరంగ సభ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలకు భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు, పాలకవర్గ సభ్యులకు సూచించారు. సమన్వయంతో పనిచేస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, డీఈ సురేష్, నాయకులు ఆర్వీ బాలాజీ, చాంద్ భాషా, సుధీర్ కుమార్, రూపేష్, బీఆర్సీ కుమార్, నదీం, సురేష్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్