బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం బాపూజీ ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్పాండెంట్ లక్ష్మన్న మాట్లాడుతూ ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఈ సందర్భంగా ఇదే రోజున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. అదే విధంగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూజీ 1889 నవంబర్ 14వ తేదీన ఆయన జన్మించారని ఆయన తండ్రి గారు మోతిలాల్ తల్లి స్వరూప రాణికి జన్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ చంద్రావతి,టీచర్లు అనీషా, హబీబా, నస్రిన్, సౌజన్య, ఫాతిమా, సౌభాగ్య, పార్వతి, సానియా, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
టి.ఉమాపతి సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.