BREAKING
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా చిన్నారుల చిరునవ్వులే దేశానికి వెలుగులు!!! శిరిడి సాయి స్కూల్ అధినేత ముత్యాలప్ప విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం కళ్యాణదుర్గం శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ - నెహ్రూ జయంతి వేడుకలు మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ

Select Suryaa Now
గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: 21వ శతాబ్దం డేటా శతాబ్దం. ప్రపంచవ్యాప్తంగా డేటాపైనే చర్చ సాగుతోంది. డేటా సెంట‌ర్లు నిర్మిస్తున్నారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్ వంటి కంపెనీలు డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ భారత దేశంలో గిగ్ వర్కర్లకు వారి డేటా నేటికీ అందుబాటులో లేదు. గిగ్ వర్కర్ తన డేటాను తానే చూసుకోలేడు. వారు ఏం పని చేశారు, ఎన్ని డెలివరీలు చేశారు, ఎంత సమయం పట్టింది, ఎంత డబ్బు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఈ సమాచారం వారికి అందేది కాదు. కష్టం వారిదే, కానీ వారి డేటాను వారే చూసుకోలేకపోయేవారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన‌ చట్టం డేటాపై వారికి హక్కును కల్పించబోతోంది. వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారో పూర్తి సమాచారం వారి చేతిలో ఉంటుంది. ప్రభుత్వం గిగ్ వ‌ర్క‌ర్ల‌కు గ్యారెంటీ ఇస్తోంది. ఈ సమాచారం వారి మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది, దాన్ని వారి చూసుకోవచ్చ‌ని లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైద‌రాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించిన తెలంగాణ‌
గిగ్ వర్కర్ల సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. కొంతకాలం క్రితం నేను తెలంగాణ‌లోని గిగ్ వ‌ర్క‌ర్ల‌తో సమావేశమ‌య్యాను. ఆ సమయంలో వారి బాధల‌ను, కష్టాలను నాకు చెప్పారు. నేను, కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి వారికి సహాయం చేయడంతో పాటు భద్రత, రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాం. ఆ  హామీని, వాగ్దానాన్ని ఈ రోజు మేం నెర‌వేర్చుతున్నాం. 
తెలంగాణ నగరాల్లో గిగ్ వ‌ర్క‌ర్లు రోజంతా ఎండలో స్కూటర్ నడుపుతూ డెలివరీలు చేస్తారు, కానీ వారు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన స్థలం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం వై-ఫై సౌకర్యంతో కూడిన  విశ్రాంతి కేంద్రాలు (రెస్ట్ జోన్లు) నిర్మిస్తోంది. అక్కడ వారు విశ్రాంతి తీసుకోవచ్చు, వారి వాహనాన్ని నిలుపుకోవ‌చ్చు.  కాసేపు కూర్చోవ‌చ్చు, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి రెస్ట్ జోన్ల‌ను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో నిర్మించబోతోంది. ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అనారోగ్యానికి గురైనా గిగ్ వ‌ర్క‌ర్లు తీవ్రంగా నష్టపోతారు. పని చేయలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబం మొత్తం సంక్షోభానికి గుర‌వుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందించడానికి గ్యారెంటీ ఇస్తోంది. గిగ్ వ‌ర్క‌ర్ల‌కూ పింఛ‌ను రావాలి, వారికీ సామాజిక భద్రత ఉండాలి. వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా కావాలి. అందుకే ప్రతి లావాదేవీలో, వారు డెలివరీ చేసిన ప్రతి సారి,  ఉబర్ రైడ్ పూర్తి చేసిన ప్రతి సారి, అది బ్లింకిట్ డెలివరీ అయినా లేదా మరే ఇతర సేవ అయినా, ప్రతి లావాదేవీ, ప్రతి డెలివరీపై 1 శాతం మొత్తం నేరుగా వారి భవిష్యత్తు, భద్రతకు జమ అవుతుంది. కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ మొత్తాన్ని తెలంగాణ గిగ్ వర్కర్స్ బోర్డులో జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోర్డు ద్వారా ఈ డబ్బు నేరుగా గిగ్ వర్కర్ల బ్యాంక్ ఖాతాలకు చేరుతుంది.

రెండు భావ‌జాలాలు

21వ శతాబ్దంలో రెండు రకాల భావజాలాలు ఉన్నాయి. ఒక భావజాలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లది. వారు గిగ్ వ‌ర్క‌ర్ల‌ను వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మార్చాలని కోరుకుంటున్నారు. వారు 24 గంటలు పని చేయాలని, వారి రక్తం, చెమట చిందించాలని, ప్రమాదాల్లో గాయపడాలని, దెబ్బలు తినాలని, చనిపోవాలని, అణచివేయబడాలని వారు కోరుకుంటున్నారు, కానీ పూర్తి లాభం మాత్రం బిలియనీర్లకు దక్కాలి. అంబానీ-అదానీలకు దక్కాలి, ఉబర్-ఓలాలకు దక్కాలి, వారి కష్టానికి తగిన ఫలితం, ప్రయోజనం వారికి దక్కకూడదు అని వారు అనుకుంటున్నారు. రెండో భావజాలం కాంగ్రెస్ పార్టీది, నా భావజాలం. గిగ్ వర్కర్లు ఈ దేశానికి పునాది. కార్మికులు ఈ దేశానికి పునాది, ఆధారం. ఇది ఒక భాగస్వామ్యం. గిగ్ వర్కర్లను భాగస్వాములుగా చేయాలని, వారిని రక్షించాలని మేం కోరుకుంటున్నాం. వారికి భద్రత, రక్షణ కల్పించాలని మేం భావిస్తున్నాం. ఇవే ఆ రెండు భావజాలాలు. ఒకవైపు గిగ్ వ‌ర్క‌ర్ల‌కు అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ వారికి బీమా ఇస్తోంది, ప్రతి లావాదేవీలో వారి కోసం డబ్బును ఖాయం చేస్తోంది, వారికి విశ్రాంతి తీసుకునే స్థలాన్ని ఇస్తోంది, వారిని భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నిస్తోంది. మరో వైపు నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ గిగ్ వ‌ర్క‌ర్ల‌ను వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మార్చాలని, కేవలం సేవకులుగా మాత్రమే ఉంచాలని, అణచివేసి తొక్కేయాలని కోరుకుంటున్నాయి. గిగ్ వ‌ర్క‌ర్లు భయపడాల్సిన ప‌ని లేదు. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మొత్తం గిగ్ వ‌ర్క‌ర్ల‌కు అండగా నిలబడ్డాయి.  మేము గిగ్ వ‌ర్క‌ర్ల‌ను భాగస్వాములుగా చేస్తాం. గిగ్ వ‌ర్క‌ర్ల కుటుంబాల విద్య, ఆరోగ్యం పూర్తి బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మేం చేయగలిగినంత సహాయం చేస్తాం. గిగ్ వ‌ర్క‌ర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.** అని రాహుల్ గాంధీ భ‌రోసా ఇచ్చారు. గిగ్ వ‌ర్క‌ర్లు త‌మ‌కు పూర్తి మద్దతు ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.