8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం
తిరుపతి వైద్యం:
చిన్నారుల్లో మూత్రపిండాల సమస్యలను సకాలంలో గుర్తించి, ప్రాణరక్షక చికిత్స అందించే వైద్యుల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగ నిర్వహించారు. తిరుపతిలోని ఎస్.వి. వైద్య కళాశాల చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్నారు అని అదనపు వైద్య విద్య సంచాలకులు ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవి ప్రభు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 69 మంది వైద్య ప్రతినిధులు 10 మంది నిపుణులైన అధ్యాపకులు పాల్గొంటున్నారు.పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్, హీమోడియాఫిల్ట్రేషన్, థెరప్యూటిక్ అఫెరిసిస్, ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్,వాస్కులర్ యాక్సెస్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యక్ష నైపుణ్యాభ్యాసం కోసం ఐదు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వహణ అధ్యక్షులు, చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఏ.ఎస్. కిరీటి మాట్లాడుతూ,మూత్రపిండాల పనితీరు దెబ్బతినడాన్ని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం చిన్నారుల ప్రాణాలను కాపాడటంలో కీలకం.ఇటువంటి శిక్షణతో పీడియాట్రిక్ ఐసీయూ వైద్య బృందాలు మూత్రపిండ అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలుగుతాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి, ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎస్. అంజన్ కుమార్ మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారుల్లో అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి పెరిటోనియల్ డయాలసిస్ సులభమైన, సమర్థవంతమైన, ప్రాణరక్షక చికిత్స. అధునాతన డయాలసిస్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరం. పీడియాట్రిక్ ఐసీయూల్లో పనిచేసే ప్రతి వైద్యుడికి ఈ చికిత్సను సకాలంలో ప్రారంభించి నిర్వహించే నైపుణ్యం అవసరంఅని పేర్కొన్నారు.మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎ. అరుముగం నిర్వాహకులు, పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్.వి.ఆర్.ఆర్. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆధారశిలా రీనల్ కేర్ ప్రాజెక్ట్ రూరల్ ఇండియా సపోర్టింగ్ ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.ఇప్పటివరకు 368 మంది వైద్యులకు శిక్షణ ఇవ్వగా, 89 మంది నిపుణులైన అధ్యాపకులు భాగస్వాములయ్యారు.ఢిల్లీ, రాయ్‌పూర్, లక్నో, పాట్నా, జమ్మూ, వారణాసి, డెహ్రాడూన్ నగరాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమ ప్రొఫెసర్ డాక్టర్ ఓ.పి. మిశ్రా మాట్లాడుతూ పీజీ చిన్నపిల్లల వైద్యులకు హీమోడయాలసిస్, థెరప్యూటిక్ అఫెరిసిస్ ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరమన్నారు. కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అభిజీత్ సాహా, తొలి వైద్య సేవల స్థాయిలోనే డయాలసిస్ నైపుణ్యాలు అందుబాటులో ఉంటే చిన్నారులకు సకాలంలో చికిత్స అందించవచ్చని తెలిపారు. ఆధారశిలా ట్రస్టీ శ్రీమతి నీనా జాలీ మాట్లాడుతూ తొలి దశలో దేశవ్యాప్తంగా సుమారు 1,000 మంది వైద్యులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మునిమోహన్, డాక్టర్ దీప్తి, చిన్నపిల్లల వైద్య విభాగ అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు వైద్యులు పాల్గొన్నారు.