BREAKING
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo

Select Suryaa Now
మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం  18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo

శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్యక్షేత్ర ప్రాంగణంలోని అన్నదాన భవనంలో శనివారం మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు 26 వ రోజు భిక్ష (అన్నప్రసాద వితరణ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  హైదరాబాద్‌ పట్టణానికి చెందిన గద్దె జ్ఞానవ శ్రీ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శివసాగర్, మౌనిక ల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాలధారణ చేసిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా అన్నదాన కమిటీ సభ్యులు పసుమర్తి రాము, పర్వతనేని మురళి మాట్లాడుతూ.దాతల సహకారంతో గత 17 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టామని తెలిపారు.భక్తులకు సేవ చేసే అవకాశం కల్పిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

దాతల సేవాభావాన్ని భక్తులు అభినందించారు.దాతలు  ముందుకు రావాలి

ఈ పవిత్రమైన అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, భక్తులు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేసేందుకు ముందుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు.భిక్ష ఏర్పాటు చేయదలచిన భక్తులు తమ పేరు, గోత్రం తదితర వివరాలను కమిటీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.దాతల సహకారంతోనే ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని,ఈ ఏడాది కూడా భక్తులు,దాతలు తమ వంతు సహకారం అందించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ అనుమోలు వెంకట శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.