మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా
గార్ల, మేజర్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జల సాధన కమిటీ ప్లెక్సీ లను చేత బూని పలు నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. అనంతరం ఎస్వీ విద్యాలయంలో జాతీయ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాటోత్ హుసేన్ నాయక్ ని ఆందోళన కారులు స్వయంగా కలిసి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంతో.. జరుగుతున్న సామాజిక ఆర్థిక సాంస్కృతిక నష్టాన్ని పేద గిరిజన రైతులు కోల్పోతున్న సారవంతమైన పంట భూములను, వారు కోల్పోతున్నారని, జీవనోపాధి పై క్షేత్ర స్థాయిలో నాయకులు హుసేన్ నాయక్ వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ కన్వీనర్ మూడు హరి నాయక్ తో పాటు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది జంపాల విశ్వ, బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీలంశెట్టి రమేష్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళీ తారకరామారావు, బీఆర్ఎస్ మండల నాయకులు ముంగి రాములు, తాళ్లూరి అనిల్, లక్ష్మీశెట్టి శ్రీనాథ్, మున్నేరు రైతు రక్షణ కమిటీ కో-కన్వీనర్లు యాకుబ్ ఆలీ, సోమ శ్రీకాంత్, భూక్య హనుమంతు, భానోత్ రమేష్, మూడు సురేషు, మూడు వాల్యా, మూడు వీరన్న, మూడు రమేష్, మూడు అశోక్, మూడు భాస్కర్, బానోత్ గోపి, శివాజీ, మూడు రాము, బాదావత్ గోపి, బాదావత్ సేవియా తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; నాగేశ్వరరావు, గార్ల, మహబూబాద్ జిల్లా