BREAKING
దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు మోదీ పాలనలో 25 ఏళ్ల సుపరిపాలనా అనుభవాలు క్రమశిక్షణ,ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం : మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరు అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు భగవాన్ బిర్సా ముండాకు పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి, ప్రధాని మోదీ శ్రద్ధాంజలి తప్పిపోయిన బాలుడును తండ్రి చెంతకు చేర్చిన పోలీసులు ఎస్సై చంద్రశేఖర్ పై ప్రజలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మందమర్రిలో 17న ఆయుర్వేద వైద్య శిబిరం - ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. తండ్రి జ్ఞాపకార్థం ఆలయాలకు రూ.50 వేల విరాళం అంతర్జాతీయ పరిశోధనలకు భారత్ పెద్దపీట కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం తగదు - సీఐటీయూ నేత అల్లి రాజేందర్ యువతలో పెరుగుతున్న మధుమేహ ముప్పు ఒడిశా గ్రామీణ ప్రాంతాలకు భారీ వరం 451 మందికి నూతన పింఛన్లు మంజూరు - పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పుస్తక పఠనం మనిషి జీవితానికి విజ్ఞానాన్ని, వికాసాన్ని, వివేకాన్ని అందించే అమూల్యమైన సాధనం.గ్రంథాలయాలు సమాజా అభ్యున్నతికి,విద్యార్థుల భవిష్యత్తుకు,యువతలో సృజనాత్మక ఆలోచనలకు పునాదులుగా నిలుస్తున్నాయి. స్థానిక గిరిజన డిగ్రీ కళాశాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను 14 నవంబర్ 2026 నుండి 20 నవంబర్ 2026 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడం, ప్రతి విద్యార్థి రోజు కొంత సమయాన్ని పుస్తక పాఠనానికి కేటాయించాలని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం మరియు అధ్యాపకులు తెలిపారు.సమాజానికి విజ్ఞానాన్ని పంచే ఙ్ఞాన దీపాలైన గ్రంథాలయాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికా రంగం పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు