BREAKING
బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు మోదీ పాలనలో 25 ఏళ్ల సుపరిపాలనా అనుభవాలు క్రమశిక్షణ,ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం : మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరు అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు

హామీల అమలులో వైఫల్యం.. కక్ష సాధింపులో వేగం! - గడ్డం కుటుంబం తీరుపై బీఆర్ఎస్ నేత మద్ది శంకర్ ధ్వజం

Select Suryaa Now
హామీల అమలులో వైఫల్యం.. కక్ష సాధింపులో వేగం! - గడ్డం కుటుంబం తీరుపై బీఆర్ఎస్ నేత మద్ది శంకర్ ధ్వజం
సూర్య, మందమర్రి : ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, నిరుద్యోగ యువత భవిష్యత్తు, దళితుల సమస్యలను పట్టించుకోకుండా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో బీఆర్ఎస్ ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గడ్డం కుటుంబం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఆరు, ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల ఓట్లతో రాజకీయంగా ఎదిగిన గడ్డం కుటుంబం, ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషి ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను దళిత సామాజిక వర్గానికి చెందిన సాధారణ కుటుంబంలో పుట్టి 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, 35 ఏళ్ల పాటు గడ్డం కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ పార్టీ మారిన నాటి నుంచి తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 45 వేల ఉద్యోగాలు, మూడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సిరామిక్స్ పరిశ్రమ, మైనింగ్ యూనివర్సిటీ, సింగరేణిలో కొత్త భూగర్భ గనులు, మందమర్రిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రారంభించిన పోలీస్ కోచింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు, స్టడీ మెటీరియల్ అందించకుండానే కొద్దికాలానికే మూసివేయడం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనన్నారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, శిక్షణ కేంద్రాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని అన్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, అంతర్గత రహదారుల విస్తరణ, ప్రధాన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు కూడా పూర్తికాలేదని ఆరోపించారు. పార్కుల అభివృద్ధి పేరుతో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, నిర్మించిన పార్కులు సైతం నిర్వహణ లేక అధ్వానంగా మారాయని విమర్శించారు. నియోజకవర్గంలోని స్మశానవాటికల నిర్మాణాలు పూర్తిచేయలేని పరిస్థితి నెలకొందని, ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. పక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంటే చెన్నూరులో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. గడ్డం కుటుంబం కోసం ఏళ్ల తరబడి పనిచేసిన పలువురు నాయకులు, కార్యకర్తలకు ప్రస్తుతం తగిన గౌరవం, సహకారం లభించడం లేదని మద్ది శంకర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరావు రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశారని, అలాగే నల్లాల ఓదెలు కుటుంబాన్ని రాజకీయంగా దూరం పెట్టారని విమర్శించారు. ధర్మయ్య, గొళ్ల వీరయ్య, నోముల ఎల్లగౌడ్, తోట సత్యనారాయణ వంటి పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమస్యలను పట్టించుకోలేదని ఉదాహరణలతో వివరించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కష్టకాలంలో అండగా నిలవలేని నాయకత్వం ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. తన విషయంలో సింగరేణి క్వార్టర్ ఖాళీ చేయించిన తీరును ప్రస్తావిస్తూ శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను పలుమార్లు తిప్పించుకుని చివరకు అధికారాన్ని ఉపయోగించి క్వార్టర్ ఖాళీ చేయించారని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలు, గతంలో అందించిన సహాయం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం తన సొంత భూమిని సైతం అమ్ముకుని ఖర్చు చేసినప్పటికీ, తనకు తగిన సహకారం అందలేదని పేర్కొన్నారు. ఒకవైపు రాజకీయంగా సేవ చేసిన వారిని దూరం పెడుతూ, మరోవైపు వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేయడం ఏ విధమైన రాజకీయ సంస్కృతని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇసుక, బొగ్గు వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పోస్టింగుల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన పలు ఆరోపణలు చేశారు. వీటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. దళితులు, పేదలు, కార్మికులు అధికంగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో సంపన్న రాజకీయ కుటుంబాల ఆధిపత్యం కొనసాగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలతో నిరూపించుకోవాలని సూచించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెన్షన్లు, స్కూటీలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు నిలిపివేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలని హితవు పలికారు. మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడం, నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించడం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనకపు రవీందర్, రాజనర్సు, ముల్కల రమేష్, బండ రవి, ఉగ్రం శ్రీను, శనిగారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.