telangana
హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు
సూర్య నస్పూర్ : హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు సారన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సంఘంపై విమర్శలు చేయడం సరికాదని హెచ్‌ఎంఎస్ బ్రాంచ్ సెక్రటరీ పొనగంటి అశోక్‌కుమార్ అన్నారు. ఆదివారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, గతంలో హెచ్‌ఎంఎస్‌లో పనిచేసిన బాజీ సైదా, ప్రస్తుతం ఆ సంఘంపై విమర్శలు చేసే ముందు తన ఎదుగుదలకు హెచ్‌ఎంఎస్ కూడా కారణమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాము 24 డిమాండ్లు సాధించామని చెప్పుకుంటున్న ఏఐటీయూసీ నాయకులు, ఇటీవల విడుదలైన డిస్మిస్ కార్మికుల సెటిల్మెంట్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా కాలం నుంచి డిస్మిస్ అయిన కార్మికులకు న్యాయం జరిగేలా యాజమాన్యంతో చర్చించారా అని ప్రశ్నించారు. సారన్న తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న నాయకుడని పేర్కొన్నారు. సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగాల విషయంలో గతంలో జరిగిన పరిణామాలపై కార్మికులకు అవగాహన ఉందన్నారు. కవితక్కపై విమర్శలు చేసే ముందు యువ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడంలో ఆమె పాత్రను గుర్తించాలని సూచించారు. గతంలో మెడికల్ అన్‌ఫిట్ కార్మికులు ఫాస్ట్‌ట్రాక్ పేరుతో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవారని విమర్శించారు. హెచ్‌ఎంఎస్, కవితక్కపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని అశోక్‌కుమార్ హితవు పలికారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ జాయింట్ సెక్రటరీ రాచకొండ సురేష్, ఎర్రంశెట్టి సాయి పాల్గొన్నారు.