సూర్య, మందమర్రి : పట్టణ ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ (మంగళవారం) మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది. హైదరాబాద్‌లోని మాతా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు చెందిన డాక్టర్ విశ్వనాథ మహర్షి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించనున్నారు. గతంలో శిబిరానికి హాజరైన రోగులతో పాటు తొలిసారిగా వైద్యం పొందాలనుకునే వారు సైతం ఈ శిబిరానికి రావచ్చని నిర్వాహకులు తెలిపారు. నిర్ణీత సమయంలో హాజరై ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.