BREAKING
చైనా గుప్పిట్లోనూ వీడని ఖనిజాల పట్టు గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి ట్రంప్ జ్యుడిషియల్ నియామకాలకు రిపబ్లికన్ల షాక్ శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం 12 గంటల పాటు అలుపెరుగని పరుగు.. ఆరోగ్యమే అసలైన సంపద! - 96, 72 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జగిత్యాల రజినేష్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోర్డాన్ చర్చిపై ఉగ్రదాడి కేసులో సంచలన తీర్పు..ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్ దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

Select Suryaa Now
బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

సూర్య- బిక్కనూర్ : నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు మూడు సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జోరు పెంచారు. గత నెల రోజులుగా నియోజకవర్గంలోని మాకం వేసి ప్రజా సమస్యలపై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన రెండు రైతు బహిరంగ సభలలో పాల్గొనేందుకు వెళ్తూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో భేటీ అయి వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, సూచించడంతో మాజీ ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, మరోవైపు పార్టీ కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆసరాగా చేసుకుని, కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి చేరికలను ప్రోత్సహిస్తున్నాడు. దీంతో ఇటీవల వివిధ గ్రామాల నుండి బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు అందుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మూడు సంవత్సరాలుగా వేచి చూశామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై గ్రామీణ ప్రాంతాలలో సానుభూతి కనిపిస్తుండడంతో పార్టీ నాయకులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు తోడుగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముజేబుద్దీన్, మాజీ జెడ్పిటిసిలు, సొసైటీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగడంతో బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఓటమి ఎరుగని నాయకుడు గంప గోవర్ధన్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందితే మంత్రి పదవి ఖాయమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న నాయకులు తెరపైకి వస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తూ నిత్యం ప్రజల మధ్యలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉంటున్నాడు. తండ్రికి మద్దతుగా బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రతినిధి గంప శశాంక్ యూత్ కార్యక్రమాలలో పాల్గొంటూ యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందే లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తూ చాప కింద నీరుల తన బలాన్ని పెంచుకుంటుంది. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలలో మంచి ఆదరణ లభించుతుండడంతో పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మూడు సంవత్సరాల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తుండడంతో పార్టీ సైనులలో జోష్ కనిపిస్తుంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉన్న అనుభవం, ప్రతి వ్యక్తిని గుర్తుపట్టి పలకరించడం, ఆయనకు ప్రతి గ్రామంలో అభిమానులు ఉండడం పార్టీకి మరింత బలం చేకూరుతుంది.