BREAKING
భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం మైత్రి సేతు యాత్ర.. భారత్, శ్రీలంక ఎన్‌సీసీ కేడెట్ల ఆధ్వర్యంలో 3550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభం పత్రికలో కథనం వచ్చినా మారని తీరు.. పంచాయతీ కార్యదర్శికి ప్రజల సమస్యలు పట్టవా?.......గతంలో పారిశుద్ధ్య లోపాలపై వార్త ప్రచురణ.. అయినా పనులు చేపట్టని వైనం.. కాలువ పూర్తిగా మూసుకుపోతున్నా స్పందన కరువు.. ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు! *పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం* విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నెక్సరియా వివాదంలో..డచ్ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనున్న వింగ్‌టెక్ బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారి సంవత్సరీకానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు మెగాస్పీడ్ సంస్థపై కీలక ప్రకటన..గత ఏడాది ఆగస్టులోనే తప్పుకున్న ఆలిస్ హువాంగ్

శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం

Select Suryaa Now
శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం

ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్ అందించేందుకు ముందుకొస్తున్నారు డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం. ఆయన తన శౌర్య మీడియా యూట్యూబ్ ఛానెల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ కుమార్, నిర్మాత తిరుమల దేవి, వెంకటలక్ష్మి, జ్యోతిష్యులు మూర్తి, శ్రీనివాస్, తదితర అతిథులుగా పాల్గొని బోదాసు నరసింహం, ఆయన టీమ్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు.

శౌర్య క్రియేషన్స్ బ్యానర్ పై వెబ్ సిరీస్ లు, సినిమాలు రూపొందించబోతున్నారు. ఈ బ్యానర్ లో 'ప్రేమాంజలి' అనే వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో బోదాసు నరసింహం హీరోగా నటిస్తుండగా, సభా ఖనన్  హీరోయిన్ గా నటించనుంది. ఈ వెబ్ సిరీస్ కు నందుటి అశోక్ గౌడ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'తిండిబోతు దెయ్యం' పేరుతో మరో వినూత్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బోదాసు నరసింహం హీరోగా, మౌనిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బోదాసు నరసింహం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  రెండు ప్రాజెక్ట్స్ కు ప్రణయ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

*శౌర్య మీడియా అధినేత, డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం మాట్లాడుతూ* - ఈ రోజు మా శౌర్య మీడియా యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన మా మిత్రులు, పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. మా శౌర్య క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త కథలు, విభిన్నమైన వినోద కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు రూపొందించి ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మధ్య టైటిల్ ఒకటి, సినిమా మరొకటి ఉంటోంది. కానీ మేము తీసే సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో టైటిల్, కథ ఒకటే ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా, ప్రేక్షకుల్ని నవ్వించాలని అనుకుంటున్నాం. చిన్న పిల్లలు కూడా మా మూవీస్, వెబ్ సిరీస్ లు చూస్తూ నవ్వుకోవాలి. మాకు శుభాకాంక్షలు తెలిపిన అతిథులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. అన్నారు.