విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
నగరం, మేజర్ న్యూస్:
విద్యార్థులు ఖాళీ సమయంలో గ్రంథాలయంలో లభించే పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మంత్రిపాలెం వ్యవసాయ విస్తరణ అధికారి కె ఎన్ వి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మంత్రిపాలెం శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆయన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వహణాధికారి జొన్న బ్రహ్మేంద్ర, గ్రామ పెద్దలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.