BREAKING
సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని విజయనగరం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాచర్ల : పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం-ఎమ్మెల్యే జేబీఆర్ ఆపదలో ఉన్న కుటుంబానికి ఆపన్నహస్తం జంట" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ నల్లచెరువు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తాటిచెర్ల వహీదా.. టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు

Select Suryaa Now
మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి పట్టణం ముఖ్య కేంద్రంగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ నిర్విరామంగా అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని,కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మార్గదర్శకంగా ఉన్నాయని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా కొనియాడారు.ప్రస్తుత కాలంలో ఉన్న యువతకి ఆదర్శప్రాయంగా హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మరింత ముందుకు వెళ్లాలని జ్ఞానోదయ హై స్కూల్ కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు ఆకాంక్షించారు.జిల్లా కేంద్రమైన మదనపల్లి జ్ఞానోదయ హైస్కూల్ నందు ఆదివారం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పవిత్ర అయ్యప్ప మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు.భిక్ష కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి భజన చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ పవిత్ర కార్యక్రమంలో దాదాపు 400 మందికి పైగా అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి ఒకవైపు సేవా కార్యక్రమాలతో పాటు మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థ సేవలు ముందుకు వెళుతున్నాయని,నేడు అయ్యప్ప మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించడం తమకు చాలా ఆనందంగా ఉందని,ఇంతటి పవిత్ర కార్యక్రమానికి హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు మిట్టపల్లి సునీల్ పూర్తి సహకారం అందించాడని,భవిష్యత్తులో మరిన్ని ఆదర్శనీయమైన సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మైండ్స్ చేపడుతుందన్నారు.వచ్చే సంవత్సరం అంబలం పూజ కూడా హెల్పింగ్ మైండ్స్  నిర్వహించబోతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అమీన్,సైషావలి,నంద్యాల హరికృష్ణ,సాయి,విశ్వనాథ్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి