మాచర్ల : పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం-ఎమ్మెల్యే జేబీఆర్
పల్నాడు ప్రాంతంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవక్షేత్రం సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తెచ్చేలా కట్టడాలను పునర్నిర్మించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన ఆయన గర్జాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని కలయతిరిగారు. పంచాయతీ ఎన్నికలు అనంతరం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించారు. జీవం ఉట్టేపడే దేవమూర్తులు, ప్రాచీన సంస్కృతికి తగ్గట్లు ఉప ఆలయాల నిర్మాణం, శ్రీ భ్రమరాంబ దేవి గర్జాలయంలో శ్రీ చక్రం ప్రతిష్టాపన, దేవాదాయ శాఖ ఇంజనీర్ డిపార్ట్మెంట్ అందించిన ప్లానింగ్ ప్రకారం వాస్తు లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామిరెడ్డి, టీడీపీ యువ నాయకులు గౌతయ్ జూలకంటి, మండల నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి, మండల నాయకులు చపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మున్నా ప్రభురాజు, మందలపు హనిమిరెడ్డి, అల్లం ప్రతాప్ రెడ్డి, అదూరి ఇన్నారెడ్డి బోడపాటి రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.